కీర్తనలు త్యాగరాజు సొగసుఁ జూడఁదరమా నీ
కన్నడ గౌళ - రూపక
పల్లవి:
సొగసుఁ జూడఁదరమా నీ సొ..
అను పల్లవి:
నిగనిగమనుచుఁ గపోలయుగముచే మెఱయు మోము సొ..
చరణము(లు):
అమరార్చిత పదయుగమో
అభయప్రద కరయుగమో
కమనీయ తనునిందిత కామ
కామరిపునుత నీ సొ..
వరబింబ సమాధరమో
వకుళ సుమంబుల యురమో
కర ధృతశర కోదండ
మరకతాంగవరమైన సొ..
చిఱునవ్వో ముంగురులో
మఱి కన్నులతేటో
వర త్యాగరాజార్చిత
వందనీయ ఇటువంటి సొ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - sogasu.r juuDa.rdaramaa nii ( telugu andhra )