| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నీకెందుకు దయరాదు రామ నీరజాక్ష |
| సింహేద్రమధ్యమ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నీకెందుకు దయరాదు రామ నీరజాక్ష నిన్నే నమ్మిన నాపై॥ |
| అనుపల్లవి: |
| రాకేందు నిభానన రామచంద్ర సాకేతపురాధీశ సర్వేశ॥ |
| చరణము(లు): |
| శరణాగత రక్షకుడనుచు నీదు బిరుదులెల్ల నీవుమరచితి వేమో॥ |
| ధీరాగ్రగణ్య ధరణిజారమణ వరమీయవయ్య పరవాసుదేవ॥ |