| కీర్తనలు | క్షేత్రయ్య | అక్కరో! యోర్వనివారు సరసుడు గాడని - ఆడుకొంటే ఆడుకొనేరు |
| అఠాణా - త్రిపుట |
| (నాయిక: పరకీయ - స్వాధీనపతిక) |
| పల్లవి: |
| అక్కరో! యోర్వనివారు సరసుడు గాడని - ఆడుకొంటే ఆడుకొనేరు |
| అను పల్లవి: |
| మ్రొక్కదగినవాని - ముద్దుమాటలవాని - మువ్వగోపాలసామిని యెవరైనగాని అక్క.. |
| చరణము(లు): |
| రామ! వానిదలచినప్పుడే - రవిక క్రిక్కిఱిసె గుబ్బ లేమో రొమ్మెల్ల నిండునే - వాని మాటంటే నా మనసు పైపై నుండునే - వాని జూచితే నవనిధుల బ్బినట్టుండునే - యెవరైనగాని అక్క.. |
| ఇంతిరో! వాడిందు వచ్చి - యెలమి కౌగిలించితే యెంతో బడలిక దీరునే - వశముగాని కంతు తాపము చల్లారునే - యింతకాదు నా సంతస మెల్ల చేకూరునే - యెవరైనగాని అక్క.. |
| పూని మువ్వగోపాలుడు - పైని చెయి వేసితే నా మేన పులక లుప్పతిల్లునే - నా తమిరేచ వానికే బిరుదుజెల్లునే - వాని గూడిన మానసమెంతో రంజిల్లునే - యెవ్వరైనగాని అక్క.. |