| కీర్తనలు | క్షేత్రయ్య | అమ్మా! యిటువంటివాని - కేమి సేయుదునే! |
| కల్యాణి - చాపు |
| (నాయిక: స్వీయ - స్వాధీనపతిక) |
| పల్లవి: |
| అమ్మా! యిటువంటివాని - కేమి సేయుదునే! |
| అను పల్లవి: |
| కొమ్మ! మువ్వగోపాలుని - గుణము చెప్పెద వినవమ్మ! |
| చరణము(లు): |
| పయ్యద-చేబట్టుకొని పాయజాలనని వాడు సయ్యాట లాడుచు నన్ను చాలా వలపించునమ్మ అమ్మా.. |
| దబ్బున పడకింటిలో - దాగియుండుకొని నాదు గబ్బిగుబ్బలనుబట్టి - కన్నులవొత్తుకొనునమ్మ అమ్మా.. |
| సమ్మతించక నే నుంటే - సారెకు నదలించి చూచి కమ్మ విల్లుకేళిలోన - కౌగిలించి కూడునమ్మ అమ్మా.. |