కీర్తనలు క్షేత్రయ్య అలల్ల అలల్ల కృష్ణ పదర నాతో నీవగలెల్ల
మంగళకైశిక - చాపు
(నాయిక: స్వీయ - స్వాధీనపతిక)
పల్లవి:
అలల్ల అలల్ల కృష్ణ పదర నాతో నీవగలెల్ల
చరణము(లు):
'చిలుకల కొలికిరో! - చెలగు నీపైటలో -
కురికేది యదియేమొ - తెలుపవే!' "అది
కలికి జక్కవలంట - తెలియవో" 'అయితే
సెలవియ్యవే పట్ట - జేరునో?' "అది పట్టరాదు
బలుకొండలు" 'అయితే - ఎలనాగా? -
పైనెక్కని - చ్చేన?' "ఒరి
చిలుకల తేజివాని - చికిలి దుర్గములవి -
తలపున నీవెక్క - దర మౌన? ఓరి!" అలల్ల ..
'చక్కని పగడంపు - చాయల అది యేమేమో
మ్రొక్కేను తెలుపవే ముదితరో!' "వన్నె
కెక్కియున్న దొండపండది" 'అయితే -
చొక్కచు మొనపంట - నొక్కనే' "అది
నొక్కరాదు కెంపు - నిక్కము"
'ఎక్కువ వెలయిచ్చిన నిచ్చేనా?' "ఓరి!
ఎక్కడ వెలలేని - చొక్కంపు మణి యిది
దక్కించు కొననంట - తసికేవ? ఓరి!" అలల్ల..
'వినవే! నీ మొగమింత తళుకుమీఱి
తనరేని అది యేమె?' "అది
యనగ అద్దములంట తెలియవ?" 'అయితే -
వనిత నీడ వచ్చునా?' "నీడ
కానగరాదు కపురంపు తునకలు" 'అయితే
నెనరుగ కలియ వచ్చేద?' "ఓరి!
ఘనుడ! మువ్వగోపాల! నిను గూడి కలసేను -
మునుపటి నెనరున - తనదేవ? ఓరి" అలల్ల..
AndhraBharati AMdhra bhArati - xEtrayya muvva gOpAla padamulu - alalla alalla kR^ishhNa padara naatoo niivagalella xEtrayya padamulu - kshetrayya - kshetragna padam - kshetrajna padamu keertana kIrtana kRiti kshetragnya kshethragnya padam ( telugu andhra )