| కీర్తనలు | క్షేత్రయ్య | ఇన్నాళ్ళు మల్లాడిన - దిందు కోసమా? |
| మోహన - ఆది |
| (నాయిక: స్వీయ - స్వాధీనపతిక) |
| పల్లవి: |
| ఇన్నాళ్ళు మల్లాడిన - దిందు కోసమా? |
| అను పల్లవి: |
| మన్నించి నాపై దయ - మరువ వద్దమ్మలార ఇన్నా.. |
| చరణము(లు): |
| మనసు గట్టి చేసుక - మగువలార! వాని మీరు కనుగొన వద్దనగానే - కనగోరుట తనువు కాసించిగాదు - తగిన చవిలేదాయె నని మీరు వెతజెంది - యసు రుసురనేరని ఇన్నా.. |
| వానిమాయల బెల్లి - వగల మాటల మీరు వీనుల వినవద్దనగానే - వినగోరుట మానవతులార! నాదు - మనసు తెలిసిన సఖిని గాన మైతిమని మిగుల - కన్నీరు నించేరని ఇన్నా.. |
| పలుమారు మా మువ్వ గో - పాలరాయని మీరు కలయవద్దనగానే - కలయగోరుట కలనైన నా మాట - గడువవద్దని మీరు తలచి జాలిచే చాలా - తల్లడమందేరని ఇన్నా.. |