కీర్తనలు క్షేత్రయ్య ఎందుదాచుకొందు నిన్ను - నేమి సేతు నేను
కల్యాణి - రూపక
(నాయిక: స్వీయ - స్వాధీనపతిక)
పల్లవి:
ఎందుదాచుకొందు నిన్ను - నేమి సేతు నేను
అను పల్లవి:
అందమైన నీ మోము - అయ్యారే ముద్దుగుల్కుచున్నది ఎందు..
చరణము(లు):
అందిందు తిరుగకురా - అతివలు నీ తోడి
పొందుగోరియే వేళ - పొగరుచున్నారు
ఎందఱెందఱని కాతు - నెంతని నే విన్నవింతు
పందెమాడు కొన్నారట! - పట్టుక పోయెద మనుచు ఎందు..
పలుమాఱు నా సామి - బయటకు వెళ్ళకు మ్రొక్కెను
నిలుపరాని మోహమున - నిన్ను జూచి చెలులు
అలరు నీ మోవి తేనె - యూని చప్పరించవలసి
కులుకు గుబ్బల ఱొమ్ము - గ్రుమ్మి పొయ్యెద మనుచు ఎందు..
మదముతో నా ముద్దు - మువ్వగోపాల నా సామి
గుదిగొన్న తమకమున - గూడి యిద్దరము
నిదుర పరవశమున - వదలునో కౌగిళ్ళు
పదిలముగ నా జడను - బట్టి కట్టుకొందునా ఎందు..
AndhraBharati AMdhra bhArati - xEtrayya muvva gOpAla padamulu - eMdudaachukoMdu ninnu - neemi seetu neenu xEtrayya padamulu - kshetrayya - kshetragna padam - kshetrajna padamu keertana kIrtana kRiti kshetragnya kshethragnya padam ( telugu andhra )