| కీర్తనలు | క్షేత్రయ్య | ఎటువంటి స్త్రీల పొందైన హితమై యుండునా? |
| బిలహరి - ఆది |
| (నాయిక: స్వీయ - స్వాధీన) |
| పల్లవి: |
| ఎటువంటి స్త్రీల పొందైన హితమై యుండునా? |
| అను పల్లవి: |
| కుటిలకుంత నా మదిలో - కూరిమితో నుండగ ఎటు.. |
| చరణము(లు): |
| మనసు మర్మము దెలియ వలసి - మగువల గొందరదెచ్చి కినిసి ప్రక్క బడద్రోసి - కేరి నవ్వేరు కనకాంగి నను ఒంపునప్పుడు - కన్నుల నీరు నించుక వినయోక్తులుగా విన్నవించిన - వితము మరువనీయదు ఎటు.. |
| చెలి ముద్దు పాదములాదిగ - శిరము దనుక చక్కదనము నలిన సంభవునకు వ - ర్ణన సేయ దరమా? అలివేణి దూరమైన - ట్లైతే మనసు దూరమా? వలపున నా తనువా రమణికి - వారకమై యుండగను ఎటు.. |
| చెలువ! మువ్వగోపాలుడైన శ్రీవెంకటరమణా! యని కిలకిల నగవుల నా యెద గు - బ్బల గుమ్ముచు కళలంటి పరవశము చేసి - కంతుకేళిన నన్నేలిన మెతలను దలప నిపుడు నా - మే నెల్ల పులకరించెగా ఎటు.. |