కీర్తనలు క్షేత్రయ్య తెలిసి తెలియలేక - పలికేరు చెలులు
మధ్యమావతి - ఆది
(నాయిక: స్వీయ - స్వాధీనపతిక)
పల్లవి:
తెలిసి తెలియలేక - పలికేరు చెలులు
అను పల్లవి:
కలిసియున్న నా సామిపై - గాక సేయ వశమా? తెలిసి..
చరణము(లు):
చలయేటి తమ బు - ద్దులు వినలేదని
యలిగి రేమి సేతు - నతివలెల్ల?
చెలువుని ముద్దమా - టలు నా వీనుల నుండి
తొలుకుచున్నవి తమ మా - టలకు చోటున్నదా? తెలిసి..
కొనగంట దముగను - గొన దింతైనాగాని
నెనరులేని దాయెనంచు - నిందించేరు
ఘనమైన సామిరూపు - కనులు నిండియుండగ
కనకాంగి! యితరులు - కానవత్తురటవే? తెలిసి..
నా పాల గల మువ్వ - గోపాలసామితో
కోపించుకొమ్మని - కొమ్మలనేరు
ఏ ప్రొద్దు నా సామి - యెద నిండి యుండగ
పాప మింతేగాని - కోపమున కిమ్మున్నదో? తెలిసి..
AndhraBharati AMdhra bhArati - xEtrayya muvva gOpAla padamulu - telisi teliyaleeka - palikeeru chelulu xEtrayya padamulu - kshetrayya - kshetragna padam - kshetrajna padamu keertana kIrtana kRiti kshetragnya kshethragnya padam ( telugu andhra )