| కీర్తనలు | క్షేత్రయ్య | పచ్చియొడలి దానర! పచ్చియొడలి దాన - పాపడు నిలువడు |
| ఆహిరి - చాపు |
| (నాయిక: స్వీయ - స్వాధీనపతిక) |
| పల్లవి: |
| పచ్చియొడలి దానర! పచ్చియొడలి దాన - పాపడు నిలువడు |
| అను పల్లవి: |
| వచ్చికూడుటకు - వేళకాదు వచ్చె తాళవోయి - వదలను నీపొందు - మచ్చిక నొయ్యారి - మా మువ్వగోపాల! పచ్చి.. |
| చరణము(లు): |
| మిసమిసలాడేటి - నొసటి సొంపుచూచి కొసరి పైకొనేవు - కొల్లలుగా కసరితే నొక వింత - గారాబు జేసేవు రసికుడ! యీ వేళ - రారాదు పోపోరా పచ్చి.. |
| పట్టకురా ఱొమ్ము - పాలంటు జేతుల ఎటు లోర్తును పరు - లేమందురు వట్టిపోతే మొఱ - పెట్టును పసిబిడ్డ అట్టె మనసు బిగ - బట్టుకో రెణ్ణెల్లు పచ్చి.. |
| కారము తిన్నాను - కరకరలాడీని ఈ రేయి శ్రీరం - గేశుడ! మరుకేళిగూడ - మా మువ్వగోపాల! ఆరడిపెట్టకు - మోరి! నా సామి! పచ్చి.. |