కీర్తనలు క్షేత్రయ్య ప్రొద్దు పోదు నిదుర రాదు - పొలతి నెడబాసినది మొదలు
వరాళి - చాపు
(నాయిక: పరకీయ - స్వాధీనపతిక)
పల్లవి:
ప్రొద్దు పోదు నిదుర రాదు - పొలతి నెడబాసినది మొదలు
అను పల్లవి:
తద్దయు వీ పాపజాతి - దైవము పగ సాధించెనమ్మ! ప్రొద్దు..
చరణము(లు):
అనలు కొనలు వాఱినట్లు - మనసు మనసు నెనసి చాల
పెనలు గొన్న చెలి మన్ననలు - వినము నుతిసేయక ప్రొద్దు..
అరువు ముడుపు గలిగిన చి - త్తరవు నెరవు ప్రతిమ వలెను
ఉర విరవై యున్న చెలిని - మరువ నెరవు గొననకట ప్రొద్దు..
మువ్వగోపాల! రమ్మని - ముద్దుపెట్టి కూడగాను - మూడవ వెరవు గాన నకట!
పువ్వు బోణి మోవి తేనె - భుజియించిన చవిదలచి ప్రొద్దు..
AndhraBharati AMdhra bhArati - xEtrayya muvva gOpAla padamulu - proddu poodu nidura raadu - polati neDabaasinadi modalu xEtrayya padamulu - kshetrayya - kshetragna padam - kshetrajna padamu keertana kIrtana kRiti kshetragnya kshethragnya padam ( telugu andhra )