| కీర్తనలు | క్షేత్రయ్య | మంచి వెన్నెల యిపుడు - మగువ మనకు |
| భైరవి - త్రిపుట |
| (నాయిక: పరకీయ - స్వాధీనపతిక) |
| పల్లవి: |
| మంచి వెన్నెల యిపుడు - మగువ మనకు |
| అను పల్లవి: |
| పంచ బాణుని కేళి - బాగుగా కూడుండ మంచి.. |
| చరణము(లు): |
| బిగువు కౌగిటిలోన - పికిలి పిట్టల రీతి బిగిమీర పెనగుచును - చిగురు మోవిని సొగసుగా నీ మేను - జుమ్మనగ జేసెదను అగడు సేయక నన్ను - ఆ పనికి లెమ్మనుమీ మంచి.. |
| సన్నజాజులు నీదు - జడ నిండ జుట్టెదను పన్నీరు గంధంబు - బాగుగా నలది చెన్ను మీరగ గూడి - చికిలిగా తమిరేచి నిన్ను మది కరగింతు - నిండు పున్నమి నేడు మంచి.. |
| పలుమారు మువ్వగో - పాల రమ్మని పిలిచి మొలక నవ్వుల తోను - ముద్దు బెట్టు నిను నెలకొని సమరతుల - నేర్పుతో నేలెదను ఎలనాగ! మోహతమ - మెల్ల దీరను నేడు మంచి.. |