| కీర్తనలు | క్షేత్రయ్య | వేడుకతో నడుచుకొన్న - విటరాయడే! |
| కాంభోజి - త్రిపుట |
| (నాయిక: సామాన్య - స్వాధీనపతిక) |
| పల్లవి: |
| వేడుకతో నడుచుకొన్న - విటరాయడే! |
| అను పల్లవి: |
| ఏడుమూడు తరములనుండి - ఇందున్న కాణాచట కూడుకొని మా మువ్వ గోపాలుడౌ విభుడు వేడు.. |
| చరణము(లు): |
| మధుర తిరుమలేంద్రుడు - మంచి బహుమానమొసగి ఎదుట గూర్చుండు మని - యెన్నిక యిమ్మనెనె! ఇదిగో రెండువేల పదము - లిపుడెంచు కొమ్మనిన చదురు మీద ఉన్న సామికి - సంతోష మింతింతగాదె! వేడు.. |
| అళుకు దీఱి తంజాపురి - నెలకొన్న విజయరాఘవుని వెలయ మనుజుల వెంబడి - వేగమె పొడగాంచి చలువ చప్పరమున నుండగ - చక్కగ వేయి పదముల పలుకరించుకోగానె - బహుమానమిచ్చె నా వేళ! వేడు.. |
| బలవంతుడౌ గోలకొండ - పాదుషా బహుమాన మిచ్చి తులసి మూర్తితో వాదు - దలచెనా వేళ! వెలయ మువ్వగోపాలుడు - వెయ్యిన్నేనూఱు పదములు నలువది దినములలోన - నన్ను గలసి వినుపించెనే! వేడు.. |