కీర్తనలు క్షేత్రయ్య సామికి సరియెవ్వరే? నాచక్కని
ముఖారి - ఆది
(నాయిక: సామాన్య - స్వాధీనపతిక)
పల్లవి:
సామికి సరియెవ్వరే? నాచక్కని
అను పల్లవి:
భామరో! తిరువళ్ళూరి వీర రాఘవ! సామి..
చరణము(లు):
నెలతరో! ఎప్పుడైన - నేనే చెక్కిలి జీరి
కలగి యెరుక లేకయే - చెలియ జీరెనంట!
తెలుసు కొమ్మనుగాని - యలగి మారు బలకక
చలియించని నిండు కుండ - వలె నుండునమ్మ! సామి..
కదసి నేనే వాని మోవి - గంటిచేసి మరపున
పదిరి యీలాగుననే - పడతి యుంచె నందున!
అదరిన? కోపగించిన? - అలసిన? సొలసిన?
మదిరాక్షి! నాచిత్తము స - మ్మతి బరచునమ్మ సామి..
భామరో మా మువ్వ గో - పాలుడౌ వీర రాఘవుడు
కామకేళి హొయలుగ - గలసి యుండగ
ఏమగువ వద్దనైన - ఈలాగుందువో యంటె
ఈ మాటెట్లంటివని - ఎంతో యుస్సురనెనమ్మ! సామి..
AndhraBharati AMdhra bhArati - xEtrayya muvva gOpAla padamulu - saamiki sariyevvaree? naachakkani xEtrayya padamulu - kshetrayya - kshetragna padam - kshetrajna padamu keertana kIrtana kRiti kshetragnya kshethragnya padam ( telugu andhra )