| కవితలు | నవమి చిలుక | శిష్ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్ |
మున్నుడి!
నవమి చిలుక కులుకుతూ పలికింది! పలుకులో నవ్య నవ్య కవిత్వం రాలింది! నవ్య నవ్య కవిత్వం ఇది. నూతనములో బహునూతన కవిత్వం! అందుకనే ఇది పూర్వ కవిత్వం గాదు ఇది నవ్యకవిత్వం గాదు ఇది భావ కవిత్వం గాదు!
అడ్డము హిరణ్య కాశ్యపుడు! శంక హిరణ్య కాశ్యపుడు! అధైర్యము హిరణ్య కాశ్యపుడు! అస్థిమితము హిరణ్య కాశ్యపుడు!
మూలము సమూలముగా త్రెంచి హృదయ సభామంటప స్తంభము పగిల్చి మనస్సు విజృంభించి నరసింహ మూర్తిత్వము తాల్చును! అప్పుడే ప్రాహ్లాదకవిత్వ మాహ్లాదముగా ఉద్భవిస్తుంది.
అందాము ప్రాహ్లాద కవిత్వ మిది అని అందాము అందుకొని ఆదరిద్దాము!
నవమి చిలుక పలికింది ప్రాహ్లాద కవిత్వము! ప్రాహ్లాద కవిత్వములో ప్రౌఢత్వ మున్నది! పామరత్వ మున్నది! దేశికి విదేశికీ నేస్తమున్నది!
ప్రాహ్లాద కవిత్వం ఆరిపోయే దీపాన్ని రగుల్పుతుంది! పరుగెత్తే పామరుణ్ణి నిలేస్తుంది! తాను నిలుస్తుంది!
ప్రాహ్లాద కవిత్వములో సావిత్రీ సత్యవంత జీవితమున్నది.
ప్రాహ్లాద కవిత్వములోని గాయత్రి అందరికీ తల్లి!
ప్రాహ్లాద బ్రహ్మయే నవమి చిలుక! నవమి చిలుక పలుకులే ప్రాహ్లాద కవిత్వం! అమూల్య మూలకవిత్వం!
నవమి చిలుక కులుకుతూ పలికింది! పలు
కులో నవ్య నవ్య కవిత్వం రాలింది! నవ్య
నవ్య కవిత్వం ఇది. నూతనములో బహునూతన
కవిత్వం! అందుకనే ఇది పూర్వ కవిత్వం
గాదు ఇది నవ్యకవిత్వం గాదు ఇది భావ
కవిత్వం గాదు!
అడ్డము హిరణ్య కాశ్యపుడు! శంక హిరణ్య
కాశ్యపుడు! అధైర్యము హిరణ్య కాశ్యపుడు!
అస్థిమితము హిరణ్య కాశ్యపుడు!
మూలము సమూలముగా త్రెంచి హృదయ
సభామంటప స్తంభము పగిల్చి మనస్సు
విజృంభించి నరసింహ మూర్తిత్వము తాల్చును!
అప్పుడే ప్రాహ్లాదకవిత్వ మాహ్లాదముగా
ఉద్భవిస్తుంది.
అందాము ప్రాహ్లాద కవిత్వ మిది అని
అందాము అందుకొని ఆదరిద్దాము!
నవమి చిలుక పలికింది ప్రాహ్లాద కవిత్వము!
ప్రాహ్లాద కవిత్వములో ప్రౌఢత్వ మున్నది!
పామరత్వ మున్నది! దేశికి విదేశికీ నేస్తమున్నది!
ప్రాహ్లాద కవిత్వం ఆరిపోయే దీపాన్ని రగు
ల్పుతుంది! పరుగెత్తే పామరుణ్ణి నిలేస్తుంది!
తాను నిలుస్తుంది!
ప్రాహ్లాద కవిత్వములో సావిత్రీ సత్యవంత
జీవితమున్నది.
ప్రాహ్లాద కవిత్వములోని గాయత్రి అందరికీ తల్లి!
ప్రాహ్లాద బ్రహ్మయే నవమి చిలుక! నవమి
చిలుక పలుకులే ప్రాహ్లాద కవిత్వం! అమూల్య
మూలకవిత్వం!