కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 042. ఐక్యమౌదామె?
42. ఐక్యమౌదామె?
ఆ మబ్బు యీ మబ్బు
ఆకాశ మధ్యాన
అద్దుకున్నట్లు మన
మైక్య మౌదామె?
ఆ తీగె యీ తీగె
అడివి పొదరింటిలో
అల్లుకున్నట్లు మన
మైక్య మౌదామె?
ఆ వాగు యీ వాగు
అడ్డాల కోనలో
యేకమైనట్లు మన
మైక్య మౌదామె?
ఆ మాట యీ మాట
అర్థాంతరములోన
వాక్యమైనట్లు మన
మైక్యమౌదామె?
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 042. aikyamaudAme? - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )