కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 014. చాకలోళ్ళ గొప్ప
14. చాకలోళ్ళ గొప్ప
    ఎల్లా గెక్కూవా, ఇం
    కెల్లా గెక్కూవా?
సదువూకున్నా బ్యామ్మర్లంతా
సాకలవోళ్ళా రాముడికంటె
    ఎల్లా గెక్కూవా?
పండాగనకా పబ్బామనకా
వండనిబువ్వా వడకనిబట్టా
సక్కదనాలా సాకలపుల్లీ
కెక్కడమడితే అక్కడ దొరుకు
    ద్దెల్లా గెక్కూవా?
పిల్లాపెళ్ళీ చేసిన్నాడూ
పెద్దాకాపూ డబ్బూలిత్తే
కల్లూనీలూ తాగీనన్నీ
కొల్లాగానూ దొరుకూతాయీ
    ఎల్లా గెక్కూవా?
చలవామడతా మొలకూ గట్టీ
జలతార్‌రుమ్మాల్‌ తలకూ జుట్టీ
యీదులయెంబడి వూరేగింపుతో
ఇలాయి లట్టే రాముడుకంటే
    ఎల్లా గెక్కూవా?
జగతీలోపల కులాల్లోకీ
సాకలవోళ్ళా కులమే గొప్పా,
సాకలవోళ్ళా కులానికల్లా
సక్కనిపుల్లీ రాముడె గొప్పా
    ఎల్లా గెక్కూవా, ఇం
    కెల్లా గెక్కూవా?
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 014. chAkalOLLa goppa - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )