కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 133. ఇంకెన్నాళ్ళు
133. ఇంకెన్నాళ్ళు (యమునాకల్యాణి)
ఈ విధి నింకెన్ని నా
ళ్ళిలను నేను కష్టపడుట?
కామ్యపదవు లందకయే
వ్యామోహమ్మున దగులక        నీవిధి...
దారేషణచే పరగతి
దలప కంధకారమ్మున        నీవిధి...
చేజే నీకై కూర్చిన
రోజాపూదండ వాడి
మోజు సన్నగిల్లిపోయి
రోజులు చింతతో గడుపు    నీవిధి...
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 133. iMkennALLu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )