కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 181. మత్తుమందు
181. మత్తుమందు
ఎవరేశారీ మత్తుమందు
ఎన్నాళ్ళదాకాను, ఈ మొద్దునిద్దర ఎవరే...
నల్లమందైతేను, నాలుగ్గడియలవరకె
కల్లు మత్తైతే పది గడియలవరకేను ఎవరే...
తాచు విషము కూడ తగ్గేను మంత్రముతో
ఏదివ్యమంత్రముతో యీమత్తు తగ్గేనో ఎవరే...
గాంధీమహాత్ముడు కనిపెట్టినట్టి యీ
సత్యాగ్రహమంత్రముతో మత్తు వదిలేనేమో
ఎవరేశారీ మత్తుమందు
ఎన్నాళ్ళదాకాను, ఈ మొద్దునిద్దర
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 181. mattumaMdu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )