కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 034. ప్రేమమాయ
34. ప్రేమమాయ
కల్లగాదిది నమ్మగా దగు సకియ!
వంగెడు బంగారు వరిపైరువోలె
జలజల ప్రవహించు జలములవోలె
వనిత నా హృదయమ్ము పడిలేచుచుండె.
అదృశ్యమైవచ్చు నాతనిశక్తి
వార్ధినుండి ప్రచండవాయువుబోలె,
అతని దూరాన నరసిన యంత
కారణమ్మును నెఱుంగకయె మ్రొక్కెదను.
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 034. prEmamAya - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )