కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 082. సముద్రము
82. సముద్రము
ఎంత లోతుంటుందొ
యీ సముద్రము చిట్టి!
అంతులేనేలేద
నంటారు కాదా!
ఈ సముద్రము దరిని
నీ అగాధపు హృదయ
మది యేమొ, చిట్టి, నా
కట్టె తలపొచ్చింది
బ్రహ్మాండమైన నీ
ప్రణయాబ్ధిలో బడే
పిల్లకాలవను నా
ప్రేమ లెఖ్ఖా జమా!        ఎంత...
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 082. samudramu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )