| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
11. బొమ్మలపెళ్లి |
| 11. బొమ్మలపెళ్లి |
|
కొబ్బరాకు బూరాలు చుట్టుకుందామ తాటాకు బొమ్మలూ అల్లుకొందామ కాగితప్పల్లకీ కట్టుకొందామ బొమ్మలకి బట్టలూ కట్టుకొందామ బొట్టు కాటుకలనూ పెట్టుకొందామ బొమ్మలకి పూసల్లు గుచ్చుకొందామ బొమ్మలా పెళ్ళిళ్లు చేసుకొందామ? ఎక్కడా లేదేమె ఈలాటి బొమ్మ! గంధంబు పూయదే గయ్యాళిబొమ్మ! పురుషుడను నేనన్న పొంకమేగాని సరస మేమెరుగునే తాటాకుబొమ్మ స్త్రీయంట తనకేమొ సిగ్గెక్కువంట అందుచేతను పూయదే ఆడబొమ్మ నూతనదంపతుల లేత అలుకల్లు పాతవారలు చెప్ప చేతగాదంచు మనకేమి మనకేమి మనకేమటంచు మనలో మనవారలే మరలదొలగేరు మనకేమి మనకేమి మనకేమటంచు మగువతో మగడేమొ మాటాడినాడు. |