| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
10. కార్తీకపౌర్ణిమ |
| 10. కార్తీకపౌర్ణిమ |
|
పక్షుల్లు పలుకకే పడియుండినాయి వృక్షాలు చూచుచూ వూరకున్నాయి తనవెంట బడుచున్న తరుణి చూడ డిదేమి పోతువున్నాడు తాను! అదుగదుగొ పొంగులోకాలు గనను! గాలి ఉయ్యాలలై కదలుచుండెడిమబ్బు కనుల కడ్డమురాగ కాలైన తడబడక పోతువున్నాడు తాను! తనగర్వ పొంకములు దెలుపుతూను! వాద్యములు వినబడవొ చోద్యములు కనబడవొ నిముసంబు నిలువడేనీడ నిలుచునొగాని పోతువున్నాడు తాను! గర్వంపు పొంగుబోకారి పోను! పక్షి కలకలములే పరిభవంబని యెంచి తెల్లబోయిన మోము తెలియకుండుటకునై పోతువున్నాడు తాను! తనువెల్ల తారుమారగుటచేను! |