| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
39. చెల్లాయి పెళ్లికట్నం |
| 39. చెల్లాయి పెళ్లికట్నం |
|
సిరియనం దగు చెల్లి సరసంపు సభలోను పరువైన లేనవ్వు పెదవులం దోగాడ భావాలె పూవులై పరిమళించెడు దండ పతికంఠసీమ నిడు తరి నట్టెచూడగా ఒకరి బొమ్మొకరిదై కనులలో కరిగిపో మరలి రాలేనిదై ... ... ... తెలియ జెప్పగ లేని తేజస్సులల్లేను పాల్తాగు బిడ్డలే పలుకులో తీపల్లె వర్ధిల్లుడో తల్లి వర్ధిల్లు కల్యాణి వర్ధిల్లు జయలక్ష్మి వర్ధిల్లుడమ్మా! |