| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
13. మూగదేవత |
| 13. మూగదేవత |
|
చినిచిన్ని పాదాల చిరుతగజ్జెల మ్రోత అవనిపై ఓబాల ఆడుచున్నదొ యనగ అవియెచట నేర్చినాయె నీరొబ్బ లడిగి నాతోజెప్పవే పుట్టగానే సరా భూమిపై నేరైన పుట్టినందుకు పుణ్యమూర్తి కావలెనన్న గుట్టు నిన్నడుగవలెనే అది గుఱుతు వెట్టుకొని మసగవలెనే మూగదేవతవంచు ముద్దు బిడ్డలదెచ్చి అమ్మబిడ్డల మమ్ము నాదరించవె యంచు ముందు బోకారబెట్టి బాలింత పొందుగా నడుముగట్టి లక్కఉయ్యాలలో లిక్కిబొమ్మను బెట్టి పక్కలోబిడ్డ నాకక్కరో ఇమ్మంచు రెమ్మొకటి చేతబట్టి ఉయ్యాల కొమ్మ కంటగనుగట్టి ఠీవిగలపట్నమున చేవగలచెట్టువై స్త్రీలపాలిట వైద్యశాల ముందరనీవు దేవతై వెలసినావె వంశాల కోవలను గట్టినావె |