| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
14. తమస్సు |
| 14. తమస్సు |
|
కనుమూసిలేచేను - వెనుదిరిగిచూచేను కనలేదు నాజంట - వినలేదు ఆజాడ గుండె గుబగుబ లాడెను నాగొంతు ఎండి గుటకడదాయెను పిలచేను పిలచేను - అలసిపోయెను అలసిపోయిన గుండె - అట్టె ముడివిడిపోవ ఆకాశమున కెగిరితి అక్కడా అంధకారమె జూచితి కేక వినబడదాయె - చూపు కనబడదాయె అంధకారము లోన - అట్టె రెక్కలుముడిచి అవనిపై నేబడితిని అక్కడా అంధకారమె గంటిని. |