| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
42. పుంతలో ముసలమ్మ |
| 42. పుంతలో ముసలమ్మ |
|
పికిలిపిట్ట పిర్రుమంటె ఒకతె ఒళ్లు జల్లుమంటె సంతబయట గొల్లుమంటె పొట్టకొరకు ముసలమ్మ కుప్పిగంతు లేయుచుంటె సకల జనులు సంతసమున దానిచుట్టు మూగుచుంటె పోయి పోయి ముసలమ్మ పొలిమేరను నిలిచి యుంటె పూజిత మన దానిదే పుంతలోన రాయిదే హద్దుకొరకు అంకె కొరకు కాలిబాడి తుడుచు కొరకు దూరములను తెలుపు కొరకు పాతినట్టి మైలురాయి నేటి దేవతాయెనే ప్రజలకు మతి పాయెనే? అహ! పూజిత మన దానిదే పుంతలోన రాయిదే. |