| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
41. ఫొటోలో |
| 41. ఫొటోలో |
|
లిల్లీ బేబీ చల్లని చూపు కొల్ల గొట్టింది నామది కొల్లా గొట్టింది ఉల్లాసముతో నావైపునకది ఉరిమీ చూచింది బేబీ ఉరిమీ చూచింది లిల్లీ ఉరిమీ చూచింది ఓహో ఉరిమీ చూచింది "లిల్లీ దాదా" యనుచు నేను మెల్లిగ బిలిచేనూ పాపని మెల్లిగ బిలిచేనూ ఉలకకతాను వూరకనుంటే కనులే నవ్వేయి లిల్లీ కనులే నవ్వేయి బేబీ కనులే నవ్వేయి ఓహో కనులే నవ్వేయి ఏ నెటనున్నా లిల్లీ చూపే ఎదటికి వచ్చింది పాకుచు ఎదటికి వచ్చింది ఏనేమెరుగక చూచుచు నుంటే ఎత్తుకు పోయింది నామది ఎత్తుకు పోయింది ఆచూపెత్తుకు పోయింది కళ్ళతో ఎత్తుకు పోయింది ఆహా ఎత్తుకు పోయింది |