'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి
| మందేరా! |
| బ్రహ్మపురము మందేరా |
| | పర్లాకిమిడి మందేరా |
| కాదని వాదుకువస్తే |
| | కటకందాఁకా మందేరా!
|
| బస్తరెల్లా మందేరా |
| | జయపూరంతా మందేరా |
| కాదని వాదుకువస్తే |
| | నాగపూర్ దాఁకా మందేరా!
|
| గోలకొండ మందేరా |
| | తెలింగానా మందేరా |
| కాదని వాదుకువస్తే |
| | నైజామంతా మందేరా!
|
| చెన్నపురము మందేరా |
| | చంగల్పట్టు మందేరా |
| కాదని వాదుకువస్తే |
| | తంజావూరును మందేరా!
|
| బెంగుళూరు మందేరా |
| | బళ్ళారీ మందేరా |
| కాదని వాదుకువస్తే |
| | కన్నడ మర్ధం మందేరా!
|
| దేవికోట మందేరా |
| | పుదుక్కోట మందేరా |
| కాదని వాదుకువస్తే |
| | కాండేదాఁకా మందేరా!
|
AndhraBharati AMdhra bhArati - kavitalu - sUtAshrama gItAlu - maMdErA! - kavirAju tripuranEni rAmasvAmi chaudari ( telugu andhra )