| కవితలు | సూతాశ్రమ గీతాలు | మరచి పోవద్దోయి |
'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి
| మరచి పోవద్దోయి | |
| పగవారు మనపైకి వచ్చిపడ్డారు కోయంచు మనయూళ్ళు కొల్లగొట్టారు, గూటిలో పిట్టల్ని కూల్చివైచారు, పొలములో పసిలేళ్ళ పొడిచివైచారు, | |
| మఱచిపోవద్దోయి మఱచిపోవద్దు! మనజాతి యగచాట్లు మరచిపోవద్దు!! | |
| కారుకోనలు దూరి కలిగి పొయ్యారు దుంపకూరలతిండి ద్రుంగి పొయ్యారు గోచిపాతలు కట్టి క్రుంగి పొయ్యారు ప్రొద్దెల్ల మనవారు పొగలి పొయ్యారు | |
| మఱచిపోవద్దోయి మఱచిపోవద్దు! మనజాతి యగచాట్లు మరచిపోవద్దు!! | |
| పంగిళ్ళ కయ్యాల పంట్రించినారు పసిపాప యుయ్యాల పారదన్నారు నిదురపోనీకోయి నీ చేతికత్తి త్రాగించు పగవారి రక్తంబు నెపుడు | |
| మఱచిపోవద్దోయి మఱచిపోవద్దు! మనజాతి యగచాట్లు మరచిపోవద్దు!! | |