| కవితలు | సూతాశ్రమ గీతాలు | నాఁడు - నేఁడు |
'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి
| నాఁడు - నేఁడు |
| కమ్మకట్టును కమ్మగుట్టును కమ్మపొదుపును కీర్తిచే, కమ్మనాఁటను దాఁటిపోయెను గంతుపెట్టుచు పూర్వమున్; |
| కత్తిఁజూపిరి సొమ్ముఁజూపిరి కమ్మవారలు రాజులై, కానివానికి లోఁగువానికిఁ గమ్మనాఁటను పూర్వమున్. |
| భూమి నమ్ముక బ్రతుకుచుండిరి కమ్మవారలు బూర్వమున్ భూమి నమ్ముక బ్రతుకుచుండిరి కమ్మవారలు నేఁడెటో! |
| మఱచిపోవకు మఱచిపోవకు మాన్యులౌ మన పూర్వులన్, మఱచిపోవకు తాత తండ్రుల మంచిమాటల నన్నిటన్. |
| వేఁగుఁ జుక్కదె వెల్గుచున్నది తూర్పు దిక్కునఁ జూడుమా! వీఁగిపోవకు కమ్మబాలుఁడ వెఱ్ఱిపోకలు పోవుచున్. |