| కవితలు | యెంకి పాటలు | ఆనాటి నావోడు |
| 33. ఆనాటి నావోడు |
|
ఆనాటి నావోడు సెందురూడా అలిగి రాలేదోయి సెందురూడా |
|
యెంకి మన మిద్దరమె యెవ్వరొద్దన్నాడు యీ సేలు యీ తోట లింక నీ వన్నాడు మాటాడుతుండంగ సెందురూడా మంచిదా పోయేవు సెందురూడా |
|
కలకాల మీదినమె నిలుసు మనకన్నాడు గాలికైనా తాను కవుగిలీ నన్నాడు ననుసూసి నవ్వేవు సెందురూడా నాయమా నా ముద్దు సెందురూడా |
|
నా కాసి సూశాడు నీ కాసి సూశాడు మద్దె సెంద్రుడె మనకు పెద్దమని సన్నాడు కన్నీరు నీకేల సెందురూడా కనికారమే శాన సెందురూడా |