| కవితలు | యెంకి పాటలు | దీపం |
| 27. దీపం |
|
ఆరిపేయవె దీపమూ యెలుగులో నీమీద నిలపలేనే మనసు ఆరిపేయవె దీపమూ ... |
|
జిమ్ముమంటా తోట సీకటైపోవాలి సీకట్లొ సూడాలి నీ కళ్ళ తళతళలు ఆరిపేయవె దీపమూ ... |
|
తళుకుతో నీ రూపు తలుసుకొని తలుసుకొని సీకట్లొ నా కళ్ళు సిల్లులడ సూడాలి ఆరిపేయవె దీపమూ ... |
|
సూపులే ఆపేసి రూపు వూసే మరిసి వొక రెరుగ కింకొకరు వొరిగి నిదరోదాము ఆరిపేయవె దీపమూ ... |