| కవితలు | యెంకి పాటలు |
| 6. దూరాన నా యెంకి |
|
యాడుంటివే యెంకి యాడుంటివే? పూతోరి పందిట్లో సీతాయి యెల్తుంటె నీ తళుకు గేపకాన నా తల తిరిగిందోలె! |
|
యాడుంటివే యెంకి యాడుంటివే? మామిడితోట కెల్లి మంచీ పండొకటి గోసి యేటోగాని నోట్లేస్తె యిసమై పోయిందోలె! |
|
యాడుంటివే యెంకి యాడుంటివే? పొత్తేళ జొన్న సేలొ సిత్తరమై పోతాది గుమ్మైనవోసనొస్తే గుండెగిరి పోయెనోలె! |
| యాడుంటివే యెంకి యాడుంటివే? |