| కవితలు | యెంకి పాటలు | కటిగ్గుండెల నా యెంకి |
| 12. కటిగ్గుండెల నా యెంకి |
|
నీ వెల్లి పోయినావంటే పచ్చినై నేనేటొ కొట్లాడు తుంటే యిరుగమ్మలక్కలతో నీవా నా యెంకి యెకసెక్క మాడుతున్నావా |
|
నిన్ను రచ్చించ మంటానే పద్దాక యెన్నొ దణ్ణాలు పెట్టేనే వొన్నె సీరలుగట్టి నీవా నా యెంకి వోసుగా తిరుగుతున్నావా |
|
పొద్దత్తమానాలు కాదే నీ వూసె వొద్దన్ననూ మరపురాదే అమ్మలక్కలతోటి నీవా నాయెంకి సెమ్మసెక్కాడుతున్నావా |
|
రేతిర్లొ మన తోటకాడా వొక్కణ్ణి నా తిప్ప లీశ్శరుడు లేడా సీకు చింతా లేక నీవా నా యెంకి పోకల్లె పొండుకున్నావా |