కవితలు యెంకి పాటలు కను బొమ్మ
19. కను బొమ్మ
నన్ను తలుసుకు యెంకి కన్ను మూయాలి
కనుబొమ్మ సూడాలి
కరిగిపోవాలి
నన్ను కలలో సూసి నవ్వుకోవాలి
కనుబొమ్మ సూడాలి
కరువు దీరాలి
నిదరలో సిగపూలు సదురుకోవాలి
కనుబొమ్మ సూడాలి
కమ్మగుండాలి
పిలుపేదొ యినగానె తెలివిరావాలి
కనుబొమ్మ సూడాలి
కతలు తెలియాలి
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - kanu bomma ( telugu andhra )