కవితలు యెంకి పాటలు కనుపాప
28. కనుపాప
అద్దమే లంటాది అందాలు తెలప
ముద్దుమాటల కెంకిదే ముందు నడక
అద్దమే లంటాది అందాలు తెలప ...
కంటెదర నా కాడ కనిపాపలో నీడ
సూసుకొంటా నొసట సుక్కెట్టు కుంటాది
అద్దమే లంటాది అందాలు తెలప
ముద్దుమాటల కెంకిదే ముందు నడక
కనిపాపలో నీడగని నవ్వుకుంటాది
మొకము సిటిలిస్తాది రకరకము లవుతాది
అద్దమే లంటాది అందాలు తెలప
ముద్దుమాటల కెంకిదే ముందు నడక
కంటిదరి నాకాడ కంట నీరెడతాది
కనిపాపలో నీడ మన సదరగొడతాది
అద్దమే లంటాది అందాలు తెలప
ముద్దుమాటల కెంకిదే ముందు నడక
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - kanupaapa ( telugu andhra )