| కవితలు | యెంకి పాటలు | మాయదారి తమ్ముడు (కృష్ణుడు) |
| 9. మాయదారి తమ్ముడు (కృష్ణుడు) |
|
నాసిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో యేడుకొండలవోడ యెంకటేశ్శరుడా |
|
ఇంతోళ్ళ మప్పూడు యీడ నిలుచుంటేని నన్ను తరిమేసి మావోణ్ణి దాశావంట నాసిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో యేడుకొండలవోడ యెంకటేశ్శరుడా |
|
యీసరికి మరిదీని నే సూడలేదాని యెంకికూడా నిన్ను యేడుకోవొచ్చింది నాసిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో యేడుకొండలవోడ యెంకటేశ్శరుడా |
|
పిల్లోణ్ని వోపాలి బేగి తెమ్మన మాని మాయమ్మ రేతీరి మరిమారి సెప్పింది నాసిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో యేడుకొండలవోడ యెంకటేశ్శరుడా |
|
మా వోళ్ళు సూశాక మల్లి నీ కిత్తాను నాసిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో యేడుకొందలవోడ యెంకటేశ్శరుడా |