| కవితలు | యెంకి పాటలు |
| 1. ముద్దుల నా యెంకి |
|
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ కూకుండ నీదురా కూసింతసేపు! |
|
నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ |
|
కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ |
|
యీడుండ మంటాది యిలుదూరిపోతాది యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ |
|
మందో మాకో యెట్టి మరిగించినాదీ వల్లకుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ |