కవితలు యెంకి పాటలు ముత్యాల పేరు
32. ముత్యాల పేరు
అద్దములొ నారాజ
అంత నీరూపు
ఇంత ముత్తెములోన
యిరికె నేలాగు
ఇన్ని పొంకాలున్న యెంకివే నీవు
ఇంత నాగుండెలో యిమిడిపోలేదా
వోసూపె వోరూపె
వోనవ్వెరాజా
యిన్నింటి వో పాలె
యెటు సెదిరినాదో
మాటలో మనసులో మంచిలో యెంకి
సొగసు నీ వోసారె అగపడవ నాకూ
అటు తిరగ విటుమసల
వా మరమ మేటో
ఆణిముత్తెములోన
ఆడిపోతావే
కునుకల్లె సినుకల్లె కూకుండె యెంకీ
కనబడక మనసులో గంతులేయవటే
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - mutyaala peeru ( telugu andhra )