| కవితలు | యెంకి పాటలు | నా యెంకి |
| 10. నా యెంకి |
|
నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు మొన్నె తిరిగొస్తనన్నాడే |
|
నీలు తేబోతుంటె నీతోడె వోలమ్మి నాయెంటె యెవరోను నడిసినట్టుంటాదె నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు ... |
|
అద్దములో సూత్తుంటె అదియేటొ సిగ్గమ్మి నా యెనక యెవురోను నవ్వినట్టుంటాదె నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు ... |
|
సల్లని యెన్నెట్లొ సాపేసి కూకుంటె ఒట్టమ్మి ఒల్లంత ఉలికులికి పడతాదె నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు ... |
|
నీతైనవోడె నా రాతెట్టగుంటాదో కళ్ళల్లో సత్తెముగ కట్టి నట్టుంటాడె నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు మొన్న తిరిగొస్తనన్నాడే |