కవితలు యెంకి పాటలు సాలు సాలు
20. సాలు సాలు
మనిసే సాలు మనిసిమాటే సాలు
మనిసి వోసనె సాలు మనసే సాలు
ఏతాము కెదురుంగ యెంకుంటె సాలు
వొంటరిగ సిటికేసి కుంటకలిపేను మనిసే సాలు...
యెంకి యందెల గలగలినబడితే సాలు
కళ్ళు మూసుకు నీరు మళ్ళ కెత్తేను మనిసే సాలు...
యెంకి గా లొకసారి యిసిరినా సాలు
తోటంత రాజల్లె తొవ్విపోసేను మనిసే సాలు...
అందాల నాయెంకి వుందంటె సాలు
నిబ్బరముగా రేత్రి నిదరపొయ్యేను మనిసే సాలు...
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - saalu saalu ( telugu andhra )