| కవితలు | యెంకి పాటలు | సాటేలా |
| 26. సాటేలా |
| సాటేలా? నీకు మాటేలా? సిన్నతనమేలా? సిగ్గేలా? |
|
ఆసీమ యీ సీమ అందరందాలు తిన్నంగ నినుసూసె దిద్దుకుంటారు సాటేలా? నీకు మాటేలా?... |
|
ముందు మన పాపణ్ణి కింద దిగనీరు యెంకి కోవంటారు యెత్తుకుంటారు సాటేలా? నీకు మాటేలా? ... |
|
యెంకొక్క దేవతై యెలిసెనంటారు యింటింట పెడతారు యెంకి నీ పేరు సాటేలా? నీకు మాటేలా? ... |