కవితలు యెంకి పాటలు
5. సత్తెకాలపు నా యెంకి
"నీతోటే వుంటాను నాయుడు బావా!
నీమాటే యింటాను నాయుడు బావా!"
"సరుకు లేమికావాలె సంతన పిల్లా"
"నువ్వు మరమమిడిసి మనసియ్యి నాయుడు బావా"
"సక్కదనమున కేమిత్తు సంతన పిల్లా"
"నువ్వు సల్లగుండు పద్దాక నాయుడు బావా"
"యేడనే నీ కాపురమో యెల్తురు పిల్లా"
"నీ నీడలోన మేడ కడతా నాయుడు బావా
నీతోటే వుంటాను నాయుడు బావా
నీమాటే యింటాను నాయుడు బావా"
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - sattekaalapu naa yeMki ( telugu andhra )