| కవితలు | యెంకి పాటలు | వుత్త మాటలు |
| 35. వుత్త మాటలు |
|
వుత్తమాటలు నీవి పొమ్మందిరా యెంకి కొత్తపాటలు పాడుకొమ్మందిరా |
|
వూరెల్త ననిపలికి మారేస మేసుకొని సకినాల పాటొచ్చు సకిన మడుగన్నాను వుత్తమాటలు నీవి పొమ్మందిరా యెంకి కొత్తపాటలు పాడుకొమ్మందిరా |
|
యీరోజు నీరాజు వూరెల్లినా డంటి యే రాపులోరూపు మారిపోయిందంటి వుత్తమాటలు నీవి పొమ్మందిరా యెంకి కొత్తపాటలు పాడుకొమ్మందిరా |
|
మొదల మీరీయేటి మొగనె కలిశారంటి మెరుపల్లె పాటెత్తి మురిపించినా డంటి వుత్తమాటలు నీవి పొమ్మందిరా యెంకి కొత్తపాటలు పాడుకొమ్మందిరా |
|
కొద్దిలో వొరహాల కొడుకునెత్తే వంటి యీ నిజమ్ము తేలేకె యీనాములిమ్మంటి వుత్తమాటలు నీవి పొమ్మందిరా యెంకి కొత్తపాటలు పాడుకొమ్మందిరా |