కవితలు యెంకి పాటలు
7. యేటిదరి నా యెంకి
'యీరేతి రొక్కతేవు యే మొచ్చినావే?'
'ఆడు నే నిక్కడే ఆడినామమ్మా'
'యేటి నురగలకేసి యేటి సూసేవే?'
'మా వోడి మనసటె మరుగుతాదమ్మా'
'సెంద్రవొంకలో యేమి సిత్రమున్నాదే?'
'వొంక పోగానె మా వోడొస్తడమ్మా
ఆడు నే నిక్కడే ఆడినామమ్మా
మావాడి మనసటె మరుగుతాదమ్మా
ఆవొంక పోగానె ఆడొస్తడమ్మా'
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - yeeTidari naa yeMki ( telugu andhra )