| కవితలు | యెంకి పాటలు | యెంకి సూపు |
| 16. యెంకి సూపు |
|
పదిమందిలో యెంకి పాట నే పాడంగ గోడసాటున యెంకి గుటక లేసే యేళ సూడాలి నా యెంకి సూపు లాయేళ సూడాలి నా యెంకి సోద్దె మాయేళ |
|
నా పాటె పాటంట నా మాటె మాటంట నలుగురమ్మలు సేరి నను మెచ్చుతావుంటె సూడాలి నా యెంకి సూపు లాయేళ సూడాలి నా యెంకి సోద్దె మాయేళ |
|
పొరుగమ్మతో నేను వొరస లాడే యేళ పొలమెల్లి నే పొద్దుపోయి వచ్చేయేళ సూడాలి నా యెంకి సూపు లాయేళ సూడాలి నా యెంకి సోద్దె మాయేళ |