| కవితలు | యెంకి పాటలు |
| 4. యెంకితో తిరపతి |
|
యెంకీ నాతోటి రాయే మన ఎంకటేశ్శరుణ్ని యెల్లి సూసొద్దాము |
|
ఆవుల్ని దూడల్ని అత్తోరి కాడుంచి మూటాముల్లీ గట్టి ముసిలోళ్ళతో సెప్పి యెంకీ నాతోటి రాయే... |
|
ఆసామి మీదేటో వూసు లాడూకొంట కొండ మెట్లన్నీ నీ కొంగట్టు కెక్కాలి యెంకీ నాతోటి రాయే... |
|
'రేతిరి పగటేల రెప్పెయ్య కెంకీని సల్లంగ సూడ' మని సామితో జెప్పాలి యెంకీ నాతోటి రాయే... |