| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | మేలుకొలుపు |

| మేలుకొలుపు |
చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి! చుక్కల్లో చంద్రుడూ చూడవచ్చాడు. తెల్లవారొచ్చింది కోడి కూసింది, చూచేటిఅక్కల్లు చూడరారమ్మ. ఆడేటి అక్కల్లు ఆడరారమ్మ, ఆడుకోరారమ్మ అక్కల్లు మీరు. ఆడేటివారికి అచ్చావుపాలు, పాడేటివారికి పాలు పంచదార. |