బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి విషయ సూచిక
     ముగ్ధ మధుర వాఙ్మయముచిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార!
    అయ్య రారా! చక్కనయ్య రార!
అల్లారు ముద్దుల పిల్లవాఁడా రార!
    అప్ప రారా! కూర్మికుప్ప రార!
రత్నాల చిటిముల్లె రార! నవ్వుంబువ
    తోట రారా! ముద్దుమూట రార!
ముత్యాల క్రోవి రా! ముచ్చట్లదీవి రా!
    పల్కు వెన్నెల చిన్ని చిల్క రార!
కన్నకాచి రార! గారాలకూచి రా!
    నాన్నరార! చిన్నియన్నరార!
ఆడ రార! నవ్వులాడ రారా! పల్కు
    లాడ రార! కుల్కులాడ రార!


శ్రీ సూర్యనారాయణా!
మేలుకొలుపు
ఉగ్గు
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!
చలికంఠము
కలువరేకుల కళ్ళు
కన్నబిడ్డలు
దోసపళ్ళు
శ్రీరాములవారు
చదువుసందెలు
మంచిమాటలు
చెలిమి
ఉన్నఊరు
ఎందుకు?
కంచికామాక్షమ్మ
కూనలమ్మ పదాలు
ఈశ్వరుడు
కాకమ్మ
అయిదు వ్రేళ్లు
సహజగుణము
పరాచకాలు
అట్లతద్ది
చప్పట్లు
బండిపాట
గచ్చకాయలు
జడుపు
బలాబలాలు
వానవల్లప్పలు
నేతిలో నేరేడుపండు
కాళ్లాగజ్జీ...
చిట్టిపొట్టి మిరియాలు
గుడుగుడుకుంచం...
చెమ్మచెక్క
నెత్తిమీద గోరింక
తాతపెండ్లి
దాగుడుమూతలు
ఒప్పులకుప్ప
బొమ్మలపెండ్లి
నాలుగుస్తంభాలాట
సందెగొబ్బె
గుమ్మాడమ్మా...
ఏనుగమ్మా ఏనుగు!
తారంగం
తారమ్మయ్యా!
తప్పుటడుగులు
చక్కిలిగింతలు
దొంగవో? దొరవో?
దీపారాధన
గోరుముద్ద; గుజ్జుముద్ద
అమ్మముద్ద; నాన్నముద్ద
దొంగబువ్వ
వెన్నెల గుజ్జులు
జోలపాట
బూచివాని బిలువనంపనాకృతజ్ఞతలు:

తెలుగు సాహితీలోకంలో లబ్ధప్రతిష్ఠులు, పండితులు, పరిశోధకులు, ప్రాచీన వాఙ్మయ ప్రియులు అయిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తెలుగు దేశంలో బాలబాలికలు పాడే పాటలు, పలికే మాటలు, చెప్పుకునే కథలు కొన్నింటిని సేకరించి 'భారతి' (1930) లో 'బాలభాష' అనే పేరుతో ప్రచురించారు.

వారి సంపూర్ణ రచనలను ప్రచురించే ప్రణాళికలో భాగంగా ప్రభాకర పరిశోధక మండలి వారు పై గేయాలను మొదటిసారిగా 1956 లో పుస్తక రూపంలో ఆర్యశ్రీ ప్రచురణాలయము ద్వారా ప్రచురించారు. ఇందులోని చిత్రములు శ్రీ గోపి వ్రాసినవి.

ప్రభాకరశాస్త్రిగారి కుమారులు, ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి సంపాదకులు, స్వయంగా తమకూ సాహిత్యలోకంలో ఒక స్థానం గల వేటూరి ఆనందమూర్తి గారిని కలిసి 'ఆంధ్రభారతి' గూర్చి తెలిపి, ప్రభాకర శాస్త్రిగారి కొన్ని గ్రంథాలను యిందులో ఉంచటానికి అనుమతి కోరినంతనే అనుమతించటమేకాక వారివద్దనున్న అమూల్య గ్రంథాలను మాకిచ్చి మమ్ములను, మా యీ ప్రయత్నాన్నీ ఆశీర్వదించినందులకు మా హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనములు. అంతేగాక తమ రచనలను కూడా కొన్నిటిని 'ఆంధ్రభారతి'లో వాడుకొమ్మని తెలిపారు. మున్ముందు వీటన్నిటినీ సాహితీప్రియులకు అందుబాటులోకి తీసుకొని రాగలము.
AndhraBharati AMdhra bhArati - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu vishhaya sUchika ( telugu andhra )